Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:14 PM

చౌటుప్పల్‌లో పన్నుల వసూళ్లకు వేగం

చౌటుప్పల్‌లో పన్నుల వసూళ్లకు వేగం

చౌటుప్పల్‌లో పన్నుల వసూళ్లకు వేగం
24-03-2026 267 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

బకాయిదారులకు రెడ్ నోటీసులు.. ఆస్తుల సీజ్‌కు చర్యలు

2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో చౌటుప్పల్ మున్సిపాలిటీ పన్నుల వసూళ్లపై దృష్టి సారించింది. కలెక్షన్ టార్గెట్‌ను సకాలంలో పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు.మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రామ్ రెడ్డి పన్నులు చెల్లించని వారికి రెడ్ నోటీసులు జారీ చేయడంతో పాటు మొండి బకాయిదారుల ఆస్తులను సీజ్ చేసే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు.పట్టణ ప్రజలు తమ ఆస్తి పన్ను, నీటి పన్ను, వ్యాపార పన్నులను గడువులోగా చెల్లించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. పన్నులు సమయానికి చెల్లిస్తేనే కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు మున్సిపాలిటీకి అందుతాయని, లేకపోతే నిధులు నిలిచిపోవచ్చని హెచ్చరించారు.అలసత్వం వహిస్తే చర్యలు మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ అంజయ్య తెలిపారు. పన్నుల వసూళ్లలో వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం చూపితే కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Sthanikam

చౌటుప్పల్‌లో పన్నుల వసూళ్లకు వేగం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News