Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:10 PM

చౌటుప్పల్‌లో ఘనంగా మండల స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్

19-02-2026 143 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని చౌటుప్పల్ జెడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాలలో ఎఫ్ పి ఎస్ టి మండల శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్‌ను ఘనంగా నిర్వహించారు. విజ్ఞానంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందించడం, శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ పరీక్ష నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాధికారి గురువారావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, శాస్త్ర విజ్ఞానం ద్వారా సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని, విద్యార్థులు చిన్ననాటి నుంచే పరిశోధనా దృక్పథంఅలవరచుకోవాలని సూచించారు. స్థానిక పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శివ కుమార్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న కోమటిరెడ్డి నరసింహారెడ్డి విజేతలకు నగదు బహుమతులు అందజేసి అభినందించారు.టాలెంట్ టెస్ట్‌లో జి. చరణ్ (జెడ్పీహెచ్‌ఎస్, చౌటుప్పల్) ప్రథమ బహుమతి, ఎల్. శ్రీజ (జెడ్పీహెచ్‌ఎస్, తంగడిపల్లి) ద్వితీయ బహుమతి సాధించారు.ఈ కార్యక్రమంలో టాలెంట్ టెస్ట్ ఇంచార్జ్ వి ఏ కె జోషి, మహేందర్ రెడ్డి ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్‌లో ఘనంగా మండల స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News