Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:05 AM

చౌటుప్పల్‌లో విద్యుత్ సమస్యలకు చెక్

చౌటుప్పల్‌లో విద్యుత్ సమస్యలకు చెక్

చౌటుప్పల్‌లో విద్యుత్ సమస్యలకు చెక్
31-03-2026 130 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

19, 12వ వార్డుల్లో 100 కెవి ట్రాన్స్‌ఫార్మర్ల ప్రారంభం

ప్రజల సమస్యల పరిష్కారానికి మున్సిపాలిటీ కీలక అడుగు

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 19, 12వ వార్డుల్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి మున్సిపల్ యంత్రాంగం కీలక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో నూతనంగా ఏర్పాటు చేసిన 100 కెవి ట్రాన్స్‌ఫార్మర్లను మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మంగళవారం ఘనంగా ప్రారంభించారు.19వ వార్డులో విద్యుత్ లోపంతో గృహిణులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వార్డు కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్ ఈ సమస్యను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన మున్సిపల్ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను మంజూరు చేసి ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్ మాట్లాడుతూ మున్సిపాలిటీలోని ప్రతి వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. 19వ వార్డులో విద్యుత్ సమస్యను పూర్తిగా తొలగించడమే కాకుండా, రాబోయే రోజుల్లో అన్ని మౌలిక వసతులను అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపల్ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్, వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, 12వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి, మొగుదాల రమేష్ గౌడ్, ఎస్.కే. జానీ బాబు, దేప రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీకాంత్ గౌడ్, విద్యుత్ శాఖ ఏఈ సతీష్ కుమార్, వర్కాల రాము గౌడ్, ఇప్ప వెంకటేష్, మలిగే మల్లేష్, రవితేజ తదితర నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్‌లో విద్యుత్ సమస్యలకు చెక్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News