Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:17 PM

చౌటుప్పల్‌లో బీసీ బాలురకు వసతి గృహం ఏర్పాటు చేయాలి

23-03-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కలెక్టరేట్‌లో ఎస్ఎఫ్ఐ వినతి – విద్యార్థుల ఇబ్బందులు వెల్లడి

చౌటుప్పల్ పట్టణంలో వెనుకబడిన తరగతుల (బీసీ) బాలుర కోసం కళాశాల వసతి గృహం ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు డిమాండ్ చేశారు.సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో, ఎస్ఎఫ్ఐ చౌటుప్పల్ మండల అధ్యక్షుడు దాసరి ప్రకాష్‌తో కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా లావుడియ రాజు మాట్లాడుతూ, హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న చౌటుప్పల్ పట్టణంలో కళాశాల వసతి గృహం లేకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

వేలాది మంది విద్యార్థులకు ఇబ్బందులు పట్టణంలో దాదాపు 10 నుండి 12 వరకు డిగ్రీ, జూనియర్ కళాశాలలు ఉన్నాయని, మారుమూల గ్రామాల నుండి రోజూ 3,000 నుండి 5,000 మంది విద్యార్థులు చదువుకోడానికి చౌటుప్పల్‌కు వస్తున్నారని చెప్పారు.బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు గ్రామాల నుండి సరైన రవాణా సౌకర్యం లేక విద్యార్థులు సమయానికి కళాశాలలకు చేరుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే వసతి గృహం ఏర్పాటు చేయాలి కళాశాల వసతి గృహం ఏర్పాటు చేస్తే విద్యార్థులు సౌకర్యవంతంగా చదువులు కొనసాగించగలరని, ప్రభుత్వం తక్షణమే స్పందించి చౌటుప్పల్‌లో వసతి గృహం ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు.

Sthanikam

చౌటుప్పల్‌లో బీసీ బాలురకు వసతి గృహం ఏర్పాటు చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News