Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:11 PM

చౌటుప్పల్‌లో 109 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

22-05-2026 114 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మునుగోడు నియోజకవర్గంలో పేదల ఆరోగ్య భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆ పార్టీ ముఖ్య నాయకులు స్పష్టం చేశారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక సహకారంతో చౌటుప్పల్ మున్సిపాలిటీతో పాటు మండలలోని వివిధ గ్రామాలకు చెందిన 109 మంది లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శుక్రవారం లక్కారంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు.​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నిరుపేదలు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను త్వరితగతిన మంజూరు చేయించారని అన్నారు. నియోజకవర్గ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాజగోపాల్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. ​ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మునుగోడు ఎన్నికల సమన్వయకర్త పబ్బు రాజు గౌడ్, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, మున్సిపాలిటీ అధ్యక్షులు సుర్వి నర్సింహగౌడ్, మండల అధ్యక్షులు బోయ దేవేందర్, మున్సిపాలిటీ మాజీ అధ్యక్షులు మొగుదాల రమేష్ గౌడ్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ గ్రామాల మాజీ/ప్రస్తుత సర్పంచులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్‌లో 109 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News