Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:09 PM

చౌటుప్పల్‌కు నూతన మున్సిపల్ వైస్ చైర్మన్

17-02-2026 93 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

11వ వార్డు కౌన్సిలర్ గోశిక వినయ్ కుమార్ ఎన్నిక

చౌటుప్పల్ మున్సిపాలిటీకి నూతన వైస్ చైర్మన్‌గా 11వ వార్డు కౌన్సిలర్ గోశిక వినయ్ కుమార్ ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన వైస్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. కౌన్సిల్ సభ్యుల మద్దతుతో ఆయన ఈ పదవిని చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ, మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల విశ్వాసానికి తగిన విధంగా పారదర్శకంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి దిశగా అడుగులు కాంగ్రెస్ నాయకత్వానికి వినయ్ కుమార్ కృతజ్ఞతలు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో చౌటుప్పల్ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని వినయ్ కుమార్ పేర్కొన్నారు. తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కౌన్సిలర్లు, మద్దతుదారులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు.

Sthanikam

చౌటుప్పల్‌కు నూతన మున్సిపల్ వైస్ చైర్మన్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News