Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:08 PM

చౌటుప్పల్‌కు నీటి కష్టాలు రానివ్వం

చౌటుప్పల్‌కు నీటి కష్టాలు రానివ్వం

చౌటుప్పల్‌కు నీటి కష్టాలు రానివ్వం
15-05-2026 204 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అవసరమైతే ప్రైవేట్ బోర్లు, అదనపు ట్యాంకర్లు

అత్యవసర కౌన్సిల్ సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు ఆదేశాలు

వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తంగా పనిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు సూచించారు. శుక్రవారం చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన అత్యవసర కౌన్సిల్ సమావేశంలో ఆయన వార్డుల వారీగా నీటి సమస్యలపై కౌన్సిలర్లతో సమీక్ష నిర్వహించారు.రాజకీయాలకు అతీతంగా అన్ని వార్డులకు సమానంగా నీటి సరఫరా జరిగేలా చూడాలని చైర్‌పర్సన్‌కు సూచించిన ఆయన.. కమిషనర్, ఏఈలు, వాటర్‌మెన్లు సమన్వయంతో పనిచేసి నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. పట్టణంలోని నీటి సమస్యలను ఎదుర్కొనేందుకు ఇప్పటికే సమృద్ధిగా నీరు ఉన్న బోర్లను గుర్తించామని తెలిపారు. అవసరమైన చోట ప్రైవేట్ బోర్లను లీజుకు తీసుకుంటున్నామని, అదనంగా మరో ఆరు నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర్ నాయక్ మాట్లాడుతూ.. అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధుల సూచనలు తీసుకుంటూ టెక్నికల్ టీం, వాటర్‌మెన్లతో సమన్వయం చేసుకుని నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్‌కుమార్, వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, ఆర్‌వో అంజయ్య, ఏఈ నితీష్‌కుమార్, సీనియర్ అసిస్టెంట్ రఘుపతి, టిడబ్ల్యూఐ సంతోష్‌కుమార్, వాటర్‌మెన్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్‌కు నీటి కష్టాలు రానివ్వం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News