Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:13 PM

చౌటుప్పల్‌కు అసెంబ్లీ హోదా ఇవ్వాలి

చౌటుప్పల్‌కు అసెంబ్లీ హోదా ఇవ్వాలి

చౌటుప్పల్‌కు అసెంబ్లీ హోదా ఇవ్వాలి
25-03-2026 250 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నియోజకవర్గ సాధన సమితి వినతి – 7 మండలాలతో కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయాలంటూ డిమాండ్

చౌటుప్పల్‌ను ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని చౌటుప్పల్ అసెంబ్లీ నియోజకవర్గ సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కొత్త అసెంబ్లీ నియోజకవర్గాల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో, చౌటుప్పల్‌ను కూడా ఇందులో చేర్చాలని కోరారు.ఈ మేరకు నేడు చౌటుప్పల్ ఆర్డీఓ అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చౌటుప్పల్ ప్రాంతం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు.దాదాపు 7 మండలాల ప్రజలు విద్య, వైద్యం, ఉపాధి, వ్యాపార అవసరాల కోసం ప్రతిరోజూ వేల సంఖ్యలో చౌటుప్పల్‌కు రాకపోకలు సాగిస్తున్నారని చెప్పారు. పెరుగుతున్న జనాభా, అభివృద్ధి దృష్ట్యా ఈ ప్రాంతానికి అసెంబ్లీ నియోజకవర్గ హోదా అవసరమని పేర్కొన్నారు.

చౌటుప్పల్‌ను కేంద్రంగా చేసుకుని నారాయణపూర్, గట్టుప్పల్, చిట్యాల, రామన్నపేట, వలిగొండ, పోచంపల్లి మండలాలను కలిపి కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కట్టెల లింగస్వామి, బర్రె రాజు పెరియార్, బోయ కుమార్, దాసరి ప్రకాష్, పంది రాకేష్, చేకూరి బాబు, నేరడి మహేష్, కట్టెల ప్రకాష్, సిరిపంగి చందు, చిత్రాల హరిప్రసాద్, పగిళ్ళ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్‌కు అసెంబ్లీ హోదా ఇవ్వాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News