Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:14 PM

చౌటుప్పల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి.. మరోకరికి గాయాలు

03-04-2026 321 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మండలం మల్కాపురం గ్రామ పరిధిలో చెరువు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరోకరికి గాయాలయ్యాయి. వివరాల ప్రకారం, 02.04.2026 సాయంత్రం సమయంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి కొబ్బరి బోండాల లోడుతో నాలుగు అశోక్ లేలాండ్ వాహనాలు హైదరాబాద్ వైపుబయలుదేరాయి. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో మల్కాపురం గ్రామం చెరువు సమీపానికి చేరుకున్నప్పుడు AP39WJ5348 నంబరు గల వాహనం టైర్ పంచర్ కావడంతో డ్రైవర్ పల్లా నవీన్ కుమార్ వాహనాన్ని రోడ్డు పక్కన పార్కింగ్ లైట్ వేసి ఆపాడు. మిగిలిన మూడు వాహనాలు కూడా ముందుగా ఆపి టైర్ మారుస్తుండగా, అదే దారిలో వస్తున్న KA56 7370 నంబరు గల లారీ కంటైనర్ డ్రైవర్ ప్రకాష్ అతివేగంగా వచ్చి వెనుక నుండి ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో సాధనాల లక్ష్మీ నరసింహ స్వామి తలకు, శరీర భాగాలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రాసపోలి కనకరాజుకు కుడి కాలికి గాయమయ్యాయి. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పల్లా నవీన్ కుమార్ (27) చికిత్స పొందుతూ ఉదయం సుమారు 5 గంటల సమయంలో మృతి చెందాడు.ఈ ఘటనపై పల్లా పవన్ కళ్యాణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీఐ మన్మధ కుమార్ దర్యాప్తు ప్రారంభించారు.

Sthanikam

చౌటుప్పల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి.. మరోకరికి గాయాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News