Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:08 PM

చౌటుప్పల్ మున్సిపల్ పాలకవర్గం నేడు కొలువుదీరుతుంది

16-02-2026 202 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మధ్యాహ్నం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక

చౌటుప్పల్ మున్సిపాలిటీ నూతన పాలకవర్గం నేడు అధికారికంగా బాధ్యతలు స్వీకరించనుంది. ప్రజల ఆశలు, అభిలాషల మధ్య మున్సిపల్ కార్యాలయం వేడుకలకు సన్నద్ధమైంది. ప్రమాణ స్వీకారోత్సవం, అనంతరం చైర్మన్–వైస్ చైర్మన్ ఎన్నికల నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు.మున్సిపల్ కమిషనర్ జి. వెంకటరామ్ రెడ్డి వివరాల ప్రకారం, సోమవారం ఉదయం 11 గంటలకు ఆర్డీవో శేఖర్ రెడ్డి పర్యవేక్షణలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక ఘట్టమైన ఈ కార్యక్రమానికి అన్ని పరిపాలనా ఏర్పాట్లు సిద్ధం చేశారు.

అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనల ప్రకారం సజావుగా సాగేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు కమిషనర్ స్పష్టం చేశారు.కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో జరగేందుకు భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది నియామకం, సమావేశ మందిర ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. రాజకీయంగా ఆసక్తికరంగా మారిన ఈ ఎన్నికల ప్రక్రియపై పట్టణ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Sthanikam

చౌటుప్పల్ మున్సిపల్ పాలకవర్గం నేడు కొలువుదీరుతుంది

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News