Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:10 PM

చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పావని వినూత్న పిలుపు

18-02-2026 457 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

బొకేలు, శాలువాలకు బదులు విద్యా సామాగ్రి అందించండి

చౌటుప్పల్ నూతన మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన మొగుదాల పావని రమేష్ గౌడ్ తన సన్మాన కార్యక్రమాల్లో బొకేలు,శాలువాలకు బదులుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అవసరమైన విద్యా సామాగ్రి అందించాలని పిలుపునిచ్చారు.ప్రజాప్రతినిధులుగా సమాజానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నదే తన ఆశయమని పేర్కొన్నారు.

మున్సిపాలిటీ 14వ వార్డు గణేష్ నగర్‌కు చెందిన ప్రముఖ ఎన్జీఓ కార్యకర్తలు ఒరగంటి శ్రీను, ఒరగంటి నరసింహ సోదరులు చైర్‌పర్సన్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో చౌటుప్పల్ మున్సిపాలిటీని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతానని తెలిపారు.

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ

ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తున్న పావని నిర్ణయం

తన పిలుపు మేరకు చౌటుప్పల్ హైస్కూల్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు అందజేసిన ఒరగంటి శ్రీనును చైర్‌పర్సన్ అభినందించారు. అనంతరం ఒరగంటి శ్రీను గౌడ్ మాట్లాడుతూ, నూతన మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన పావని రమేష్ గౌడ్, పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

సన్మాన కార్యక్రమాల్లో ఆర్భాటాలకు దూరంగా ఉండి విద్యా సామాగ్రి అందించాలని ఇచ్చిన పిలుపు ఇతర ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. పావని రమేష్ గౌడ్ పిలుపు మేరకు పరీక్షల కోసం అవసరమైన విద్యా సామాగ్రిని అందజేశామని తెలిపారు.

Sthanikam

చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పావని వినూత్న పిలుపు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News