Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:08 PM

చౌటుప్పల్ చెక్‌పోస్టులో పశువుల లారీ పట్టివేత

18-05-2026 136 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అనుమతులు లేకుండా తరలిస్తున్న 25 పశువులు స్వాధీనం

ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా గుర్తించిన పోలీసులు

లారీ సీజ్.. డ్రైవర్‌పై కేసు నమోదు

చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి టోల్‌ప్లాజా చెక్‌పోస్టు వద్ద పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న పశువుల లారీ పట్టుబడింది. లారీలో ఇరుకుగా తరలిస్తున్న 25 పశువులను స్వాధీనం చేసుకుని, వాహనాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. చౌటుప్పల్ ఎస్‌హెచ్‌వో జి. మన్మధ కుమార్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ ఎ. నరేష్, ఏఆర్పీసీ సీతారాం రెడ్డి పెట్రోమొబైల్-01 వాహనంలో రాత్రి గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో వచ్చిన సమాచారం మేరకు పంతంగి చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు.

హైదరాబాద్ వైపు వెళ్తున్న అశోక్ లేలాండ్ లారీ (TS 7UE 3009)ను ఆపి తనిఖీ చేయగా, ఎలాంటి అనుమతులు లేకుండా 9 ఆవులు, 16 ఎద్దులు కలిపి మొత్తం 25 పశువులను ఇరుకుగా తరలిస్తున్నట్లు గుర్తించారు.లారీ డ్రైవర్ ఎండి షఫీ (50), సరూర్‌నగర్ పరిధిలోని జలపల్లి వాసిగా గుర్తించారు. ఖమ్మం జిల్లా పనితాపురం సంత నుంచి పశువులను కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు విచారణలో తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. లారీ యజమాని ఎండి పాషా అని డ్రైవర్ వెల్లడించినట్లు తెలిపారు.

పశువులను, లారీని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌హెచ్‌వో జి. మన్మధ కుమార్ తెలిపారు.

Sthanikam

చౌటుప్పల్ చెక్‌పోస్టులో పశువుల లారీ పట్టివేత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News