Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:08 AM

చౌటుప్పల్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అవకతవకలు

01-04-2026 70 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎన్నికల అధికారులు అమ్ముడుపోయారని ఫిర్యాదు – బార్ కౌన్సిల్‌కు న్యాయవాదుల విజ్ఞప్తి

చౌటుప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు న్యాయవాదులు తెలంగాణ బార్ కౌన్సిల్‌ను ఆశ్రయించారు. ఈ నెల 26న జరిగిన ఎన్నికల్లో ఎన్నికల అధికారులు కానుగుల వెంకటయ్య, సిహెచ్ రాధా కిషన్ రావులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వాకిటి నరసింహారెడ్డి, పాల పరమేష్, ఏ. రంగారెడ్డి బుధవారం ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల అధికారులు రెండు బ్యాలెట్ బుక్కులను ముద్రించి, వాటిపై సంతకాలు చేసి, ఒక వర్గానికి అనుకూలంగా సహకరించారని ఆరోపించారు. ఒక న్యాయవాది వద్ద డమ్మీ బ్యాలెట్ పేపర్ లభించడంతో, అందులో స్వస్తిక్ గుర్తు ఉండటం అనుమానాలకు దారితీసిందన్నారు.తాము వెంటనే ఎన్నికల అధికారులకు విషయాన్ని తెలియజేసి, రెండు అధికారుల సంతకాలు ఉండేలా చూడాలని, బయట నుంచి వచ్చే బ్యాలెట్ పేపర్లను అడ్డుకోవాలని సూచించినప్పటికీ వారు పట్టించుకోలేదని వాపోయారు. ఓటింగ్ సమయంలో ఒక ఓటరు సెల్‌ఫోన్‌తో వీడియో కాల్‌లో ఉండటం గమనించి, ఫోన్‌ను అధికారులకు అందించినా, దాన్ని సీజ్ చేయకుండా తిరిగి ఇచ్చినట్టు తెలిపారు.ఓట్ల లెక్కింపులో కూడా స్వస్తిక్ గుర్తులు వేరువేరుగా ఉండటం, ఇంకు తేడాలు కనిపించడం, బ్యాలెట్ పేపర్లు ముడతలు పడటం వంటి అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయాలపై తాము రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ, ఎన్నికల అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు.బ్యాలెట్ పేపర్లు, స్వస్తిక్ గుర్తులు, ఇంకు ప్యాడ్‌లను సీజ్ చేయాలని కోరినా చర్యలు తీసుకోలేదని, దీంతో ఎన్నికల అధికారులు అమ్ముడుపోయినట్టు స్పష్టమవుతోందని వారు అన్నారు.ఈ నేపథ్యంలో చౌటుప్పల్ బార్ అసోసియేషన్ ఎన్నికలను రద్దు చేసి, మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, సంబంధిత ఎన్నికల అధికారులపై విచారణ జరిపి బార్ కౌన్సిల్ నుంచి తొలగించాలని తెలంగాణ బార్ కౌన్సిల్‌ను న్యాయవాదులు డిమాండ్ చేశారు.

Sthanikam

చౌటుప్పల్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అవకతవకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News