చాట్రాయి : ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. చాట్రాయి గ్రామానికి చెందిన కమ్ముల కొండలరావు కుమారుడు మల్లిఖార్జునరావు – ఆశా సారికల వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో చనుబండ పీఏసీఎస్ చైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు, గవర వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు నూతన దంపతులను ఆశీర్వదించి వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి బంధువులు, మిత్రులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి