Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:15 PM

చాట్రాయిలో విజయవంతమైన సార్వత్రిక సమ్మె

చాట్రాయిలో విజయవంతమైన సార్వత్రిక సమ్మె

చాట్రాయిలో విజయవంతమైన సార్వత్రిక సమ్మె
February 12, 2026 07:27 PM 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం స్థానిక చాట్రాయి సెంటర్ లో ఎఐసిసిటియు,ఎఐటియుసి,సిఐటియు ఆద్వర్యంలోని ఆశ,అంగన్వాడి, మధ్యాహ్న భోజన పథకం వంట ఏజెన్సీ లు, పాఠశాల పారిశుధ్య కార్మికులు, డ్వాక్రాలోని విఏఓలు, ఉపాధి హామీ పథకం యానిమేటర్లు పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొన్నారు. సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఖండించారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు దుర్గం పుల్లారావు, కొమ్ము ఆనందం, ఇవి శ్రీనివాసరావు, చాగంటి రాజారావు సిఐటియు నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత రంగంలో ప్రధాన భూమిక పోషి స్తున్న కార్మికుల వేత నాలు ఉద్యోగ భద్రతపై నిర్లక్ష్యం వహిస్తున్నా యని దుయ్యబట్టారు. మోడీ 12 ఏళ్ల పాలన లో కనీస వేతనాల కోసం కార్మికులు ఉద్య మాలు చేస్తున్నా, వేతనాలు పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూల్గే నక్కపై తాటి పండు పడ్డట్టు కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చారని, 8 గంటల పని దినాలను మార్చి 12 గంటలు ఆడవాళ్లు కూడా రాత్రి షిఫ్ట్ లో పనిచేయాలని జీవో తీసుకురావడం జరిగిందని తెలిపారు. పెరుగుతున్న ధరలు కుటుంబ ఖర్చులు, విద్యా, వైద్యం ఖరీ దైన నేటి దశలో ప్రభుత్వ పథకాలలో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లందరూ అంగన వాడి, ఆశ వర్కర్లు, మధ్యా హ్నభోజన పథకం కార్మికులు, పాఠశాల పారిశుద్ధ్య కార్మికులు, డ్వాక్రాలో వీఏఓలు, ఉపాధి హామీ పథకం యానిమేటర్లు, పంచాయతీ కార్మికులు ప్రభుత్వ సంస్థలలో వెట్టిచాకిరి చేస్తున్నారనీ, వీరెవరికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం ఇవ్వటం లేదనీ ఇది అత్యంత దుర్మార్గమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మ గాంధీజాతీయ ఉపాధి హామీ పథకానికి నిధులు కూడా ఇవ్వ కుండా నిర్వీర్యం చేసే కుట్రతోనే, గాంధీ పేరును తొలగించి బివి-జి రామ్ పేరుతో ఉపాధి హామీ పథకం తెచ్చి క్రమేపీ దాన్ని ఎత్తివేయాలని చూస్తుందని కొమ్ము ఆనందం తెలిపారు. కార్మికులకు ఉన్న 29 చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడలు రుద్దటం కార్మిక వర్గం పై బిజెపి ఆర్ఎస్ఎస్ చేస్తున్న దాడి అని, ఇప్పటివరకు కార్మికవర్గం అనుభవించిన హక్కులు ఇక కనుమరు గవుతాయని వాటిని కాపాడుకోవడం యావత్ కార్మిక వర్గానికి తప్పనిసరి కర్తవ్యం అని అన్నారు. అనంతరం తహశీల్దార్ కార్యలయం వరకు ర్యాలీ నిర్వహించటం జరిగింది. డిప్యూటీ తాసిల్దార్ కు 1) కేంద్రం తెచ్చిన వీబీ- గ్రామ్ జీ చట్టాన్ని, నాలుగు లేబర్ కోడ్ లను రద్దుచేయాలి!

2) మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకాన్ని యధాతంగా అమలు చేయాలి!

3) ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలి!

4) స్కీమ్ వర్కర్ల అందరి కి ఆశ,అంగన్వాడి,మిడ్ డేమిల్,పాఠశాల పారిశుద్ధ్య కార్మికులు, డ్వాక్రాల వీఎవోలు, ఉపాధి హామీ పథకం యానిమేటర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి 26 వేల వేతనం ఇవ్వాలి!

5) ఆరోగ్య బీమా అమలు చేయాలి! పి ఎఫ్,మెడికల్ అలవెన్సు లు మంజూరు చేయాలి.

6) ప్రతినెలా ఒకటో తేదీన జీతం ఇవ్వాలి బిల్లులు చెల్లించాలి.

7) కేంద్రం ప్రవేశపెట్టిన మిడ్ డే మిల్ పథకానికి బడ్జెట్లో కేటాయింపులు పెంచాలి.

8) సామాజిక భద్రత కల్పించాలి రాజకీయ వేధింపుల నుండి ఉద్యోగ భద్రత కల్పించాలి.

9) 12 గంటల పని విధానాన్ని రద్దుచేసి 8 గంటల పని దినాన్ని కొనసాగించాలి! 10)మహిళలకు రాత్రి డ్యూటీ లో నుండి మినహాయింపు ఇవ్వాలి. తదితర డిమాండ్స్ తో కూడిన వినతిపత్రం సమర్పిం చారు. ఈ కార్యక్రమంలో,ఏఐసీసిటియు అనుబంధ అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం మండల నాయకులు కలపాల వెంకటేశ్వర రావు, చాట్ల బాబు రావు, అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం మండల అధ్యక్షులు బంటు పూజిత, బి సీతామహాలక్ష్మి, సిఐటియు నాయకులు కంచర్ల రాంబాబు, రాజారావు, తదితరులు పాల్గోన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News