Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:40 AM

చాట్రాయిలో ట్రాక్టర్ యజమానులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించిన ఎస్సై డి రామకృష్ణ

13-02-2026 212 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగం ఆదేశాల మేరకు చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణ మండల కేంద్రంలో ట్రాక్టర్ యజమానులు మరియు డ్రైవర్లతో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. అతివేగం మరియు అజాగ్రత్త గ్రామీణ రహదారులపై ట్రాక్టర్లను అతివేగంతో నడపడం వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నాయని, డ్రైవర్లు నిలకడగా, జాగ్రత్తగా వాహనాలను నడపాలని ఎస్సై సూచించారు.

ప్రతి ట్రాక్టర్‌కు తప్పనిసరిగా ఆర్.సి , ఇన్సూరెన్స్ మరియు డ్రైవర్లకు లైసెన్స్ ఉండాలని స్పష్టం చేశారు. రికార్డులు సరిగా లేని వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వయస్సు నిండని పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వకూడదని యజమానులకు తెలిపారు. మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు గురైతే, యజమానులనే బాధ్యులను చేస్తూ కఠిన కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.

ట్రాక్టర్ ట్రాలీలలో పరిమితికి మించి లోడ్ వేయకూడదని, ముఖ్యంగా వ్యవసాయ పనుల సమయంలో రాత్రి వేళల్లో వెనుక వైపు రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై మోటార్ వాహనాల చట్టం ప్రకారం భారీ జరిమానాలు విధిస్తామని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించి రోడ్డు ప్రమాద రహిత మండలంగా చాట్రాయి మండలాన్ని మార్చడానికి సహకరించాలని ఎస్సై రామకృష్ణ కోరారు.

Sthanikam

చాట్రాయిలో ట్రాక్టర్ యజమానులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించిన ఎస్సై డి రామకృష్ణ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News