Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:14 AM

చాట్రాయిలో ‘మన్ కీ బాత్’ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

20-02-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయిలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను స్థానిక నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా దళిత మోర్చా అధ్యక్షుడు శ్రీకర్ బుర్రి మాట్లాడుతూ, ‘మన్ కీ బాత్’ ద్వారా ప్రధాని ప్రతి నెల చివరి ఆదివారం రేడియో, టెలివిజన్‌ ద్వారా దేశ ప్రజలతో నేరుగా సంభాషిస్తున్నారని తెలిపారు.

2014 అక్టోబర్ 3న ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రజలతో ప్రత్యక్ష అనుసంధానానికి వేదికగా నిలిచిందని చెప్పారు. స్వచ్ఛ భారత్‌, పర్యావరణ పరిరక్షణ, విద్య, మహిళా సాధికారత, దేశభక్తి, సామాజిక బాధ్యత వంటి అంశాలపై అవగాహన కల్పించడం దీని ముఖ్య లక్ష్యమన్నారు. సమాజంలో మంచి పనులు చేస్తున్న వ్యక్తులను ప్రోత్సహిస్తూ, విద్యార్థులు, రైతులు, యువతకు ప్రేరణాత్మక సందేశాలు ఇస్తున్నారని పేర్కొన్నారు.

విద్యార్థులకు దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలను సందర్శించే అవకాశం కల్పించాలనే లక్ష్యంతో జవహర్లల్ నెహ్రు యూనివర్సిటీ , యూనివర్సిటీ అఫ్ ఢిల్లీ , ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ ఢిల్లీ , అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సస్ , న్యూ ఢిల్లీ , పార్లమెంట్ భవనం వంటి ప్రదేశాలను సందర్శించాలన్నారు. అలాగే బి .ఆర్ . అంబేద్కర్ఆ లోచనలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, “మనిషి స్థాయిని మార్చేది చదువే” అన్న ఆయన సందేశాన్ని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గడ్డం సంజీవరెడ్డి, కనుమత రెడ్డి ముత్తారెడ్డి, బాలస్వామి, పోతిరెడ్డిపల్లి చెన్నారావు, ఎస్సీ మోర్చా జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ తగడం రాజు, కూరపాటి బాబ్జి, ఓబీసీ మోర్చా నాయకుడు ఆదిమూలం మోహన్ శర్మ, ఇజ్జగిరి కేశవ నర్సింహారావు, జనసేన నాయకుడు సవరం రామారావు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చాట్రాయిలో ‘మన్ కీ బాత్’ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News