Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:36 PM

చాట్రాయిలో మహిళా శక్తి జోష్… ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

చాట్రాయిలో మహిళా శక్తి జోష్… ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

చాట్రాయిలో మహిళా శక్తి జోష్… ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
March 18, 2026 07:21 PM 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి,: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చాట్రాయి మండలంలో మహిళా శక్తి ఉత్సాహం మధ్య బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు పనపల సురేష్ ఆదేశాల మేరకు చనుబండ గ్రామానికి చెందిన ఏలూరు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బుర్రి శ్రీకర్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.

నూజివీడు పురపాలక సంఘ కార్యాలయం మహిళల సందడితో కళకళలాడింది. ఈ సందర్భంగా మహిళలకు చీరలు, మెమెంటోలు అందజేసి సన్మానించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ సందర్భంగా బుర్రి శ్రీకర్ మాట్లాడుతూ మహిళలు ఇక వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారని పేర్కొన్నారు. మహిళా సాధికారతే సమాజ అభివృద్ధికి బలమైన పునాది అని తెలిపారు. పారిశుద్ధ్య మహిళా సిబ్బంది సేవలను ప్రత్యేకంగా అభినందిస్తూ, వారి కృషి లేకుండా గ్రామాల్లో పరిశుభ్రత సాధ్యం కాదని అన్నారు.

శరణాల మాలతీరాణి మాట్లాడుతూ మహిళ చదువుకుంటే కుటుంబం మొత్తం అభివృద్ధి చెందుతుందని, మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు.

జిల్లా అధ్యక్షుడు చౌటపల్లి విక్రమ్ కిషోర్ మాట్లాడుతూ మహిళలు పురుషులతో సమానులని, పిల్లలకు మొదటి గురువు తల్లేనని పేర్కొన్నారు. సమాజంలో మార్పు రావాలంటే మహిళలే ముందుండాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నూజివీడు మున్సిపల్ కమిషనర్ కె.పేరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి నగడపాటి సత్యనారాయణ, పట్టణ అధ్యక్షురాలు మల్లిపూడి నాగరాణి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఇలపర్తి కుసుమ కుమారి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది పెద్ద ఎత్తున హాజరయ్యారు.

మొత్తం మీద ఈ వేడుకలు మహిళా శక్తి, ఐక్యతను ప్రతిబింబిస్తూ ప్రత్యేకంగా నిలిచాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News