Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:16 AM

చాట్రాయిలో డెమొక్రటిక్ పి.ఆర్.టి.యు సర్వసభ్య సమావేశం

20-02-2026 205 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎస్‌టీయూ నుంచి 40 మంది సభ్యుల చేరిక – కొత్త కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

చాట్రాయి, ఉపాధ్యాయ సంఘాల కార్యకలాపాలకు చాట్రాయి మండలం మరోసారి వేదికైంది. డెమొక్రటిక్ పి.ఆర్.టి.యు చాట్రాయి మండల శాఖ సర్వసభ్య సమావేశం గురువారం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో ఎస్‌టీయూ ఉపాధ్యాయ సంఘం నుంచి ఏకంగా 40 మంది సభ్యులు డెమొక్రటిక్ పి.ఆర్.టి.యులో చేరడం విశేషంగా నిలిచింది. మండల స్థాయిలో ఇది సంఘ బలోపేతానికి సంకేతంగా భావిస్తున్నారు.

సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ డి. శ్రీను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. వెంకటేశ్వరరావు, ఏలూరు జిల్లా అధ్యక్షులు శ్రీను, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పి. రామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.వి.ఎస్. శోభన్ బాబు, రాష్ట్ర కార్యదర్శి ఆర్. నాగేశ్వరరావు తదితరులు హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.

రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ డి. శ్రీను మాట్లాడుతూ, ఉపాధ్యాయ సంఘాలు కేవలం ఆర్థిక ప్రయోజనాలకే పరిమితం కాకుండా పాఠశాలల అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు, ఉపాధ్యాయుల గౌరవ పరిరక్షణ కోసం సమగ్ర దృష్టితో పనిచేయాలని సూచించారు. హక్కుల సాధనతో పాటు బాధ్యతలను కూడా సమర్థంగా నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల కోసం పుట్టిన ఏకైక సంఘం పి.ఆర్.టి.యే అని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు అనుభవిస్తున్న అనేక హక్కులు సంఘ పోరాటాల ఫలితమని గుర్తుచేశారు. భవిష్యత్తులోనూ సమస్యల పరిష్కారంలో ముందుండేలా కార్యాచరణ కొనసాగుతుందని తెలిపారు.

రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పి. రామకృష్ణ మాట్లాడుతూ, పి.ఆర్.సి, డి.ఏలు, ఏపీ జి.ఎల్.ఐ, పి.ఎఫ్ లోన్లు వంటి కీలక అంశాల పరిష్కారానికి సంఘటిత పోరాటం అవసరమని అన్నారు. సభ్యులందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

జిల్లా నాయకులు మాట్లాడుతూ, ఏలూరు జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయుల సమస్యలపై తక్షణ స్పందనతో పరిష్కారం అందించేలా కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. రాష్ట్ర కార్యదర్శి ఆర్. నాగేశ్వరరావు మాట్లాడుతూ, వివిధ సంఘాల నుంచి 40 మంది చేరిక మండల నాయకత్వానికి నిదర్శనమని అభినందించారు.

అనంతరం 2026–27 సంవత్సరానికి గాను కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

నూతన కార్యవర్గం:

అధ్యక్షులు – బి. చిన్న రాంబాబు

కార్యదర్శి – తేరా రామారావు

గౌరవ అధ్యక్షులు – కె. ఏసుబాబు

అసోసియేట్ అధ్యక్షులు – ఎస్. రాము, జి. నాగభూషణం

ఉపాధ్యక్షులు – జి. రామాంజనేయులు, కె. చిట్టిబాబు, బి. శ్రీను

మహిళా ఉపాధ్యక్షులు – బి. నీల, బి. చంద్ర కళావతి

కార్యదర్శులు – ఇ. రంగారావు, ఎ. ప్రసాద్, జె. రాజేష్, ఎ. క్రాంతి, బి. గణేష్, ఎం. సక్రు, వి. రవీంద్ర

మహిళా కార్యదర్శి – అపర్ణ

ఆర్గనైజింగ్ సెక్రటరీలు – పి. తిరుపతయ్య, ఎం. ఆరాధనరావు, బి. రామదాసు, బి. వర్మారావు, ఎల్. భార్గవ మణికంఠ చారి

జిల్లా కార్యదర్శి – చిన్నం శ్రీనివాసరావు

జిల్లా ఉపాధ్యక్షులు – డి. నాగేశ్వరరావు

జిల్లా కార్యవర్గ సభ్యులు – పి. రాఘవరావు, వెదుళ్ళ వెంకటేశ్వరరావు, ఎన్. శ్రీనివాసరెడ్డి, ఎండి. ఈశా

ఎన్నికల అధికారులుగా జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఈ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన సభ్యులు సంఘ నియమాలకు కట్టుబడి ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

Sthanikam

చాట్రాయిలో డెమొక్రటిక్ పి.ఆర్.టి.యు సర్వసభ్య సమావేశం

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News