Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:40 AM

చాట్రాయిలో చెరువులో పడి యువకుడు మృతి

చాట్రాయిలో చెరువులో పడి యువకుడు మృతి

చాట్రాయిలో చెరువులో పడి యువకుడు మృతి
11-03-2026 525 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం చాట్రాయి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అంబటి గోపి కుమారుడు అనుదీప్ (17) చెరువులో పడి మృతి చెందాడు. గ్రామంలోని దీప చెరువులో అనుదీప్ పడిపోవడంతో ఈ ఘటన జరిగింది.

యువకుడు చెరువులో పడి మృతి చెందాడనే విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సమాచారం అందుకున్న చాట్రాయి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. యువకుడు చెరువులో పడటానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Sthanikam

చాట్రాయిలో చెరువులో పడి యువకుడు మృతి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News