Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:18 AM

చాట్రాయిలో 22 మంది రైతులకు షాక్‌… మోటార్ కేబుల్ వైర్లు చోరీ

20-02-2026 222 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం స్థానిక చాట్రాయి లో ఒకేసారి 22 మంది రైతులకు సంబంధించిన మోటార్ కేబుల్ వైర్లు చోరీకి గురయ్యాయి. మండల కేంద్రమైన చాట్రాయి గ్రామానికి చెందిన గడ్డం నాగ వెంకట సత్యనారాయణ రెడ్డి, పాములపాటి నరసింహారెడ్డి,అప్పి రెడ్డి, సవరం శ్రీను, పాములపాటి శ్రీనివాసరెడ్డిలతో పాటు మరో కొంత మంది రైతుల వ్యవసాయ మోటార్ల పంపు సెట్లు కు వెళ్ళు కేబుల్ వైర్లు చోరీకి గురయ్యాయి. గురువారం ఉదయం తోటలోకి వెళ్లి చూడగా మోటార్ వైర్లు పూర్తిగా కట్ చేసి తీసుకు వెళ్లినట్లు రైతులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ప్రాంతంలో గతంలో కూడా వైర్లు చోరి చేయటం పరిపాటిగా మారిందని, కరెంటు పని తెలిసినవారు రాత్రి సమయాలలో ఈ విధంగా చోరీలకు పాల్పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు చాట్రాయి మండలంలో ఇదే వృత్తిగా ఎంచుకొని ఏదో ఒక గ్రామంలో ఏదో ఒక ప్రాంతంలో ఈ విధమైనటువంటి చోరీలకు పాల్పడుతున్నట్లు మండలంలోని వివిధ గ్రామాల రైతులు తెలియజేస్తున్నారు. పోయిన నెలలో నరసింహారావుపాలెం గ్రామంలో కూడా ఇదే తరహాలో అనేకమంది రైతుల మోటారు బోర్లకు సంబంధించిన కేబుల్ వైర్లను అపహరించినట్లు రైతులు తెలియజేశారు అసలే కరెంటు కోతలతో రాత్రి సమయాలలో ఇస్తున్న కరెంటుతో రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే గోటిచుట్టపై రోకలిపోటులా ఈ వ్యవహార శైలి మారిందని, పోలీసు వారు సీసీ కెమెరాలు ఏర్పాటు లాంటి వాటిపై ప్రత్యేకమైన దృష్టి సారించి ఈ దొంగతనాలను అరికట్టకపోతే మున్ముందు రైతులు తీవ్ర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైర్లు చోరీ దొంగలను పట్టుకొని కఠినంగా శిక్షిస్తే తప్ప చోరీలు ఆగవని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు

Sthanikam

చాట్రాయిలో 22 మంది రైతులకు షాక్‌… మోటార్ కేబుల్ వైర్లు చోరీ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News