Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:38 AM

చాట్రాయి మండలంలో పదో తరగతి పరీక్షలకు సిద్ధం – రెండు కేంద్రాల్లో 372 మంది విద్యార్థులు. మండల విద్యాశాఖాధికారి 2 మాసగిరి శ్రీనివాస్

15-03-2026 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మండలంలోని విద్యార్థుల సౌకర్యార్థం రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి మాసగిరి శ్రీనివాస్ తెలిపారు.

ఒక కేంద్రాన్ని ఆర్సియం ప్రాథమికోన్నత పాఠశాలలో, మరొకదాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చాట్రాయిలో ఏర్పాటు చేశారు. ఈ రెండు పరీక్షా కేంద్రాల్లో కలిపి మొత్తం 372 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 18 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు అధికారులు వెల్లడించారు.

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, కూర్చునే ఏర్పాట్లు, శుభ్రత వంటి అన్ని సౌకర్యాలను కల్పించినట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా సాగేందుకు పోలీస్ శాఖ సహకారం కూడా తీసుకున్నామని, అవసరమైన వైద్య సహాయం అందుబాటులో ఉండేలా వైద్య శాఖతో సమన్వయం చేసుకున్నామని మండల విద్యాశాఖ అధికారి మాసగిరి శ్రీనివాస్ పేర్కొన్నారు.

పరీక్షలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Sthanikam

చాట్రాయి మండలంలో పదో తరగతి పరీక్షలకు సిద్ధం – రెండు కేంద్రాల్లో 372 మంది విద్యార్థులు. మండల విద్యాశాఖాధికారి 2 మాసగిరి శ్రీనివాస్

Article Image

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మండలంలోని విద్యార్థుల సౌకర్యార్థం రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి మాసగిరి శ్రీనివాస్ తెలిపారు.

ఒక కేంద్రాన్ని ఆర్సియం ప్రాథమికోన్నత పాఠశాలలో, మరొకదాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చాట్రాయిలో ఏర్పాటు చేశారు. ఈ రెండు పరీక్షా కేంద్రాల్లో కలిపి మొత్తం 372 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 18 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు అధికారులు వెల్లడించారు.

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, కూర్చునే ఏర్పాట్లు, శుభ్రత వంటి అన్ని సౌకర్యాలను కల్పించినట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా సాగేందుకు పోలీస్ శాఖ సహకారం కూడా తీసుకున్నామని, అవసరమైన వైద్య సహాయం అందుబాటులో ఉండేలా వైద్య శాఖతో సమన్వయం చేసుకున్నామని మండల విద్యాశాఖ అధికారి మాసగిరి శ్రీనివాస్ పేర్కొన్నారు.

పరీక్షలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News