Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 08:46 AM

చర్చిలకు నిధులు అందేలా సమగ్ర సర్వే చేయాలి: ఎన్‌సీసీ డిమాండ్

19-12-2025 128 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

క్రైస్తవుల గుర్తింపుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్‌సీసీ కృతజ్ఞతలు

యాదాద్రి భువనగిరి స్థానిక ప్రతినిధి

తెలంగాణ రాష్ట్రంలోని క్రైస్తవుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న సానుకూల దృక్పథానికి నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ (ఎన్‌సీసీ) పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఎన్‌సీసీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు జాన్ జహంగీర్ అన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రతి చర్చికి దీపాలంకరణ కోసం రూ.30 వేల నిధులు మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… క్రైస్తవుల పవిత్ర పండుగ అయిన క్రిస్మస్‌ను ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. అయితే నిధుల విడుదల కోసం చర్చి కమిటీల రిజిస్ట్రేషన్ పత్రాలు, బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ తదితర డాక్యుమెంట్లు సమర్పించాలని కోరుతున్న నేపథ్యంలో, భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందన్న అనుమానాలను చర్చి కమిటీ సభ్యులు వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ సిబ్బంది ద్వారా సమగ్ర సర్వే నిర్వహించి, చర్చి ఉన్న ప్రతి ప్రాంతానికి సమానంగా ప్రభుత్వ నిధులు మంజూరు చేయాలని, ఏ చర్చీ కూడా నిధుల నుంచి వంచితమవకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా యేసు ప్రభువు రాష్ట్ర ప్రజలందరినీ చల్లగా చూడాలని ఆకాంక్షిస్తూ, తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

చర్చిలకు నిధులు అందేలా సమగ్ర సర్వే చేయాలి: ఎన్‌సీసీ డిమాండ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News