Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:40 AM

చనుబండలో పశు వైద్య శిబిరంలో పాల్గొన్న పిఏసియస్ ఛైర్పర్సన్ మోరంపూడి శ్రీనివాసరావు

21-01-2026 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 21(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పశు పోషకులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ, బడ్జెట్ లో తగిన నిధులు కేటాయిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నదని చనుబండ పీ ఏ సీ ఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు పేర్కొన్నారు. బుధవారం ఉదయం చాట్రాయి మండలం, చనుబండ గ్రామంలో పశువైద్యశాల వద్ద పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం ను మోరంపూడి శ్రీనివాస రావు, నెక్కళకపు వెంకటేశ్వర రావు (చౌదరి),చీదిరాల మారేశ్వర రావు, కొత్తగుండ్ల రమేష్ లు ప్రారంభించి రైతులకు మినరల్ మిక్చర్,నత్తలనివారణ మందులు, ఇతర మందులు, టానిక్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మోరంపూడి మాట్లాడుతూ చంద్ర బాబు స్వర్ణాంధ్ర - 2047 ఆశయాలకు అనుగుణంగా పశువుల ఆరోగ్య పరిరక్షణ, ఉత్పాదకత పెంపుదల, వ్యాధుల నియంత్రణ, శాస్త్రీయ పశు యాజమాన్యం, గోకులాలు, పశుగ్రాసాల పెంపకం వంటి వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తూ,రాష్ట్రంలోని పశు పోషకులకు ఆర్ధిక భరోసా కల్పిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు జీవనోపాధిని అందిస్తోందని అన్నారు.రైతులు ఈ పశు వైద్య శిబిరాలను ఉపయోగించుకొని లబ్ది పొందాలని మోరంపూడి కోరారు.ఏదైనా పశువు ప్రమాదవశాత్తు మరణించిన ఎడల పశుపోషకులు ఆర్థికంగా నష్టపోకుండా ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పశు బీమా పథకాన్ని అమలు చేస్తోందని మోరంపూడి చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎల్ ఎస్ ఏ పవనకుమారి, నక్కా రాము,మిద్దె చెన్నారావు (పిల్లచెన్న),విస్సంపల్లి వేంకటేశ్వర రావు, విస్సంపల్లి యాకోబు, విస్సంపల్లి వెంకటేశు, చనుబండ, కృష్ణా రావుపాలెం పంచాయతీల రైతులు పాల్గొన్నారు.

Sthanikam

చనుబండలో పశు వైద్య శిబిరంలో పాల్గొన్న పిఏసియస్ ఛైర్పర్సన్ మోరంపూడి శ్రీనివాసరావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News