Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:24 AM

చనుబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రేరణ స్పూర్తి" అనే స్టడీ మెటీరియల్ పుస్తకాల పంపిణీ లో పాల్గొన్న పిఎసిఎస్ చైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు

చనుబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రేరణ స్పూర్తి" అనే స్టడీ మెటీరియల్ పుస్తకాల పంపిణీ లో పాల్గొన్న పిఎసిఎస్ చైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు

చనుబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రేరణ స్పూర్తి" అనే స్టడీ మెటీరియల్ పుస్తకాల పంపిణీ లో పాల్గొన్న పిఎసిఎస్ చైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు
January 20, 2026 07:19 PM 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

"విద్వాన్ సర్వత్రా పూజ్యతే"అనే ఆర్యోక్తి అక్షర సత్యం అని చనుబండ పీ ఏ సీ ఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు అన్నారు.

మంగళవారం మధ్యాహ్నం చాట్రాయి మండలం, చనుబండ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ వారు పంపిన "ప్రేరణ స్పూర్తి" అనే స్టడీ మెటీరియల్ పుస్తకాల పంపిణీ మోరంపూడి శ్రీనివాస రావు ముఖ్య అతిథిగా,ప్రధానోపాధ్యాయులు రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగినది. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థి దశలో 10 వ తరగతి బోర్డు పరీక్షలు చాలా కీలకం అని మోరంపూడి పేర్కొన్నారు.100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ స్టడీ మెటీరియల్ స్టూడెంట్స్ కు చాలా ఉపయోగకరమని ఆయన అన్నారు. ఈ "ప్రేరణ స్పూర్తి"స్టడీ మెటీరియల్ ను బోర్డ్ పరీక్షకు ప్రిపేర్ కావడానికి అనుకూలంగా తయారు చేయడం జరిగిందనీ, ఈ స్టడీ మెటీరియల్ చదివి విధార్ధినీ,విధ్యార్ధులు మంచి మార్కులు సంపాదించుకుంటారని మోరంపూడి ఆశాభావం వ్యక్తం చేశారు.

విద్యాశాఖామంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలను పెంచాలని తపన పడుతున్నారని మోరంపూడి అన్నారు.

ఈ చనుబండ గ్రామంలోని ఉన్నత పాఠశాల విద్యార్థిని,విద్యార్థులు ఈ స్టడీ మెటీరియల్ ను చక్కగా చదువుకొని మంచి ఫలితాలు సాధించాలని మోరంపూడి కోరారు. హెచ్ ఎం రవీంద్రనాథ్ కూడా స్టడీ మెటీరియల్ యొక్క ఉపయోగాలను స్టూడెంట్స్ కు తెలియ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు నెక్కళపు వెంకటేశ్వర రావు, పెద్ద చెరువు సాగు నీటి సంఘం వైస్ చైర్మన్ గవర వెంకటేశ్వర రావు,ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు,10 వ తరగతి స్టూడెంట్స్ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News