Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:15 AM

చిట్యాలలో ఘనంగా గుత్తా అమిత్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు

31-12-2025 733 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సేవా కార్యక్రమాలతో చిట్యాలలో గుత్తా అమిత్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిట్యాల స్థానికం ప్రతినిధి మహేందర్ రెడ్డి

చిట్యాల మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి సమక్షంలో జరిగిన ఈ సేవా కార్యక్రమంలో ఉరుమడ్ల గ్రామపంచాయతీ వార్డు సభ్యుడు జన్నపాల శ్రీను పాల్గొని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఈ కార్యక్రమానికి సహకారం అందించారు.

అనంతరం నార్కట్‌పల్లి శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గుత్తా అమిత్ కుమార్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. జీవితంలో మరింత ఉన్నతమైన పదవులు అధిరోహించాలని కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో గురుస్వామి బెల్లి వెంకటేశ్వర్లు ప్రత్యేక పూజలను నిర్వహించగా, స్థానిక ప్రజలు, పార్టీ శ్రేణులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమన్వయంగా సాగడంతో జన్మదిన వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Sthanikam

చిట్యాలలో ఘనంగా గుత్తా అమిత్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News