Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:16 AM

చిట్యాల సర్పంచుల ఫోరం ప్రతినిధుల భేటీ గ్రామాభివృద్ధికి ఐక్యతే మార్గం: ఎమ్మెల్యే వేముల వీరేశం

04-01-2026 286 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల ప్రతినిధి స్థానికం

చిట్యాల మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నికైన కాటం వెంకటేశం ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం ప్రతినిధులతో ఎమ్మెల్యే సుదీర్ఘంగా చర్చించారు.ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ, సర్పంచులందరూ ఐక్యతతో పనిచేస్తేనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గ్రామాల్లో ఎదురయ్యే ఏవైనా సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచిస్తూ, తన వంతుగా పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు జోగు సురేష్, తాళ్లవేలంల, ప్రధాన కార్యదర్శి ఆవుల సునీత–యాదయ్య (సంకెనపల్లి), కార్యదర్శి మిర్యాల వెంకటేశం (నేరడ), కోశాధికారి మహిపాల్ రెడ్డి (వణిపాకల)తో పాటు ఎలుకట్టి సర్పంచ్ సాగర్ల యాదమ్మ–యాదయ్య, బొంగుని చెరువు సర్పంచ్ కట్ట ఆశయ, చిన్నకాపర్తి సర్పంచ్ ఆవుల సుందర్, పిట్టంపల్లి సర్పంచ్ అందే అండాలు రాములు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాల సర్పంచుల ఫోరం ప్రతినిధుల భేటీ గ్రామాభివృద్ధికి ఐక్యతే మార్గం: ఎమ్మెల్యే వేముల వీరేశం

Article Image

చిట్యాల ప్రతినిధి స్థానికం

చిట్యాల మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నికైన కాటం వెంకటేశం ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం ప్రతినిధులతో ఎమ్మెల్యే సుదీర్ఘంగా చర్చించారు.ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ, సర్పంచులందరూ ఐక్యతతో పనిచేస్తేనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గ్రామాల్లో ఎదురయ్యే ఏవైనా సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచిస్తూ, తన వంతుగా పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు జోగు సురేష్, తాళ్లవేలంల, ప్రధాన కార్యదర్శి ఆవుల సునీత–యాదయ్య (సంకెనపల్లి), కార్యదర్శి మిర్యాల వెంకటేశం (నేరడ), కోశాధికారి మహిపాల్ రెడ్డి (వణిపాకల)తో పాటు ఎలుకట్టి సర్పంచ్ సాగర్ల యాదమ్మ–యాదయ్య, బొంగుని చెరువు సర్పంచ్ కట్ట ఆశయ, చిన్నకాపర్తి సర్పంచ్ ఆవుల సుందర్, పిట్టంపల్లి సర్పంచ్ అందే అండాలు రాములు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News