Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:25 AM

చిట్యాల లొ తీవ్ర లో వోల్టేజ్ సమస్య

చిట్యాల లొ తీవ్ర లో వోల్టేజ్ సమస్య

చిట్యాల లొ తీవ్ర లో వోల్టేజ్ సమస్య
08-01-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

100కేవిఏ ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయాలనీ డిమాండ్.

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

చిట్యాల పట్టణంలోని 10వ వార్డు ముత్యాలమ్మ గుడి పరిసర ప్రాంతంలో తీవ్ర లో వోల్టేజ్ సమస్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న 160 కేవీఏ ట్రాన్స్ఫార్మర్‌పై 250 నుంచి 300 వరకు విద్యుత్ సర్వీసులు, 30–35 ఏసీలు, రెండు గ్రామపంచాయతీ మోటర్లు, రెండు ఇండస్ట్రియల్ కనెక్షన్లు ఉండటంతో అధిక లోడు పడుతున్నట్లు తెలుస్తోంది.

అధిక లోడ్ కారణంగా కేవలం 180 వోల్టేజీ మాత్రమే వస్తుండటంతో ఇళ్లల్లో మోటార్లు, ఫ్యాన్లు, లైట్లు, ఏసీలు సక్రమంగా పనిచేయడం లేదని స్థానికులు వాపోతున్నారు. వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో ట్రాన్స్ఫార్మర్ పక్కనే మరో 100 కేవీఏ ట్రాన్స్ఫార్మర్‌ను తక్షణమే మంజూరు చేసి లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించాలని బీజేపీ నాయకుడు, తెలంగాణ మలిదశ ఉద్యమ నేత చికిలం మెట్ల అశోక్ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు SE, DE, AD, AEలను కోరారు.

ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Sthanikam

చిట్యాల లొ తీవ్ర లో వోల్టేజ్ సమస్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News