Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:29 PM

చైనా మాంజా ముప్పు – నిర్లక్ష్యం ప్రాణాలకు ప్రమాదం

11-01-2026 139 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ:మేడ్చల్ జిల్లా కీసర ప్రాంతంలో గాలిపటం చైనా మాంజాతో ఓ ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డ ఘటన జరిగింది. బైక్‌పై ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా మెడకు మాంజా చుట్టుకోవడంతో లోతైన గాయం ఏర్పడింది. వెంటనే స్పందించిన స్థానికులు బాధితుడిని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు మెడపై 19 కుట్లు వేశారు.సంక్రాంతి పండుగను ఆసరాగా చేసుకుని నిషేధిత చైనా మాంజా దొంగచాటుగా విక్రయాలు కొనసాగుతున్నాయి. ఈ మాంజా వల్ల పక్షులు, పాదచారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికే పలువురు గాయపడిన ఘటనలు చోటు చేసుకున్నా కూడా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ఉండాలంటే ఇది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత. చైనా మాంజా విక్రయిస్తున్న దుకాణాలు లేదా వ్యక్తుల గురించి సమాచారం తెలిసిన వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలి.

*చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది. అప్రమత్తంగా ఉండండి, ప్రాణాలను కాపాడండి.*

Sthanikam

చైనా మాంజా ముప్పు – నిర్లక్ష్యం ప్రాణాలకు ప్రమాదం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News