Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 02:20 PM

చదువుతోనే భవిష్యత్తు మార్గం–పాఠశాల సందర్శించిన

20-01-2026 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణం నెహ్రూ నగర్‌లో ఉన్న ప్రాథమిక పాఠశాలను నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం,తరగతి గదులు, విద్యార్థుల హాజరు,చదువుల స్థాయి గురించి వివరాలు తెలుసుకున్నారు.అనంతరం మూడవ తరగతి విద్యార్థిని వైష్ణవి,నాలుగవ తరగతి విద్యార్థి విఘ్నేష్‌లను పాఠ్య పుస్తకం చదవమని అడగగా వైష్ణవి స్పష్టంగా,చక్కగా చదివింది.దీనిపై సంతృప్తి వ్యక్తం చేసిన శాసనసభ్యులు వైష్ణవి, విఘ్నేష్‌లను మెచ్చుకొని అభినందించారు. విద్యార్థులు ఇలాగే మంచి చదువులు చదివి తల్లిదండ్రులకు,ఉపాధ్యాయులకు,నారాయణఖేడ్ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. చదువుతో పాటు క్రమశిక్షణ, మంచి విలువలు అలవర్చుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని దిశా నిర్దేశం చేశారు. అలాగే పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఉండేలా చూడాలని, ముఖ్యంగా నాణ్యమైన భోజనం అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఉపాధ్యక్షుడు దారం శంకర్ సెట్, పాఠశాల ఉపాధ్యాయురాలు మేఘవత్ లత, పండరీ రెడ్డి,రామకృష్ణ, మాజీ ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్ మజీద్, సాయిలు పటేల్,శాతం దత్తు,షారు ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చదువుతోనే భవిష్యత్తు మార్గం–పాఠశాల సందర్శించిన

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News