Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:03 PM

“చదువుకో తెలంగాణ – బాగా చదవండి” పది తరగతి పోస్టర్‌ను ఆవిష్కరించిన:ఖేఢ్ ఎమ్మెల్యే

02-02-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం:

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పది తరగతి విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో రామ్ లైఫ్ బీమా సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించిన “చదువుకో తెలంగాణ – బాగా చదవండి” పది తరగతి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను నారాయణఖేడ్ శాసనసభ్యుడు డాక్టర్ పి సంజీవరెడ్డి తన నివాసంలో ఘనంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పది తరగతి విద్యార్థులకు మొత్తం రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల నగదు బహుమతులను ప్రకటించారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంచడం, ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.రామ్ లైఫ్ బీమా సంస్థ ఆధ్వర్యంలో “చదువుకో తెలంగాణ – బాగా చదవండి – పది తరగతి” పేరుతో ఈ ప్రతిభా పురస్కారాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర స్థాయి ప్రతిభావంతులకు, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి మొదటి స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు వివిధ స్థాయిల్లో నగదు బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యే విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది అని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి ఉన్నత స్థానాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో పోటీ భావనను పెంచడంతో పాటు, తల్లిదండ్రుల్లోనూ చదువుపై అవగాహన పెంచుతుందని తెలిపారు.పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తాహెర్ అలీ, మాజీ మండల పరిషత్ సభ్యుడు ముంతాజ్ సెట్, రామ్ లైఫ్ బీమా సంస్థ సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని విద్యార్థులను ప్రోత్సహించాలని కార్యక్రమ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

“చదువుకో తెలంగాణ – బాగా చదవండి” పది తరగతి పోస్టర్‌ను ఆవిష్కరించిన:ఖేఢ్ ఎమ్మెల్యే

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News