Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వర్షాభావ పరిస్థితుల్లో పత్తి పంటను కాపాడుకోండి: వ్యవసాయ అధికారి సంతోష్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:21 PM

చైనా మాంజా విక్రయించినా, వినియోగించినా జైలు తప్పదు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్

30-12-2025 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
మహబూబాబాద్, స్థానికం ప్రతినిధి బాలు

మహబూబాబాద్ జిల్లా పరిధిలో నిషేధిత చైనా మాంజా విక్రయం, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డా. శబరీష్ స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో గాలిపటాల ఎగరవేతకు యువత సిద్ధమవుతున్న తరుణంలో, ప్రమాదకరమైన చైనా మాంజా వినియోగం పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. చైనా మాంజా (సింథటిక్ దారం, గాజు పొడి కలిపిన దారం) వినియోగం వల్ల పక్షుల మెడలు, రెక్కలు కోసుకుపోవడం, ద్విచక్ర వాహనదారులు తీవ్రంగా గాయపడటం, ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉంటుందని ఆయన తెలిపారు. ప్రజల ప్రాణాలకు తీవ్ర ముప్పుగా మారిన ఈ మాంజాను ఎవరైనా విక్రయించినా లేదా వినియోగించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చైనా మాంజా విక్రయం లేదా వినియోగంలో పాల్గొన్నవారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని, ఇది చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. నిషేధిత మాంజా నిల్వలు, విక్రయాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు చైనా మాంజాను పూర్తిగా నివారించి, ప్రభుత్వ అనుమతితో ఉన్న కాటన్ దారాలతో మాత్రమే గాలిపటాలు ఎగరవేయాలని సూచించారు. ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తున్నట్లు లేదా వినియోగిస్తున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.

Sthanikam

చైనా మాంజా విక్రయించినా, వినియోగించినా జైలు తప్పదు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News