Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 11:07 PM

బుర్కా ధరించి దొంగతనాలకు యత్నం..!

బుర్కా ధరించి దొంగతనాలకు యత్నం..!

బుర్కా ధరించి దొంగతనాలకు యత్నం..!
18-02-2026 190 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

42, 43 వార్డుల్లో అనుమానాస్పద వ్యక్తి సంచారం – సీసీ కెమెరాల ఏర్పాటు కోరిన కాలనీవాసులు

సూర్యాపేట:

పట్టణంలోని 42, 43వ వార్డుల్లో బుర్కా ధరించి తిరుగుతున్న అనుమానాస్పద వ్యక్తి దొంగతనాలకు యత్నిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి అంజలి పాఠశాల – నిర్మల ఆసుపత్రి చౌరస్తా పరిసర ప్రాంతాల్లో ఆ వ్యక్తి సంచరిస్తూ గల్లీలు గమనిస్తూ రెక్కీ నిర్వహించినట్లు కాలనీవాసులు తెలిపారు. ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య జనసంచారం లేని వీధుల్లో తిరుగుతూ వృద్ధులు, మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు సమాచారం. రాత్రి సమయంలో 42వ వార్డులో ఓ వృద్ధురాలు ఇంటి ముందున్న అరుగు మీద కూర్చున్న వేళ ఆమె మెడలో ఉన్న పుస్తెల తాడు లాగేందుకు యత్నించినట్లు బాధితురాలు తెలిపింది. మెడపై చేయి వేసిన వెంటనే ఆమె గట్టిగా అరిచడంతో చుట్టుపక్కల వారు బయటకు రావడంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిపారు.

ఇలాంటి సంఘటనలు మరెక్కడైనా జరిగే ప్రమాదం ఉందని భయపడుతున్న 42, 43వ వార్డుల ప్రజలు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రెండు వార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజలకు రక్షణ కల్పించాలని 42వ వార్డు కౌన్సిలర్ అంగిరేకుల నాగార్జున, 43వ వార్డు కౌన్సిలర్ బత్తుల ఝాన్సీ రమేష్ ద్వారా నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. పోలీస్ శాఖ అధికారులు స్పందించి అనుమానాస్పద వ్యక్తిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళలు, వృద్ధులు, పిల్లలకు రక్షణ కల్పించాలని వార్డు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Sthanikam

బుర్కా ధరించి దొంగతనాలకు యత్నం..!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News