Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:57 PM

బోరంచ గ్రామ పాపమ్మ గడ్డ కాలనీవాసులకు రేషన్ సౌకర్యం

06-02-2026 293 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో గత కొన్ని నెలలుగా రేషన్ కార్డు లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలోని పాత ఊరు నుండి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో “పాపమ్మ గడ్డ” అనే కొత్త కాలనీ ఏర్పడటంతో, అక్కడ నివసిస్తున్న పేద కుటుంబాలు రేషన్ సరుకుల కోసం పాత ఊరు వరకు వెళ్లి తీసుకురావాల్సి వస్తోంది. ఈ సమస్య వృద్ధులు, మహిళలు, కూలీలకు తీవ్ర ఇబ్బందిగా మారింది.ఈ పరిస్థితిని గమనించిన గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు కలిసి నారాయణఖేడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజల సమస్యను విన్న వెంటనే ఎమ్మెల్యే స్పందించి సంబంధిత అధికారులు మరియు గ్రామ రేషన్ డీలర్‌తో మాట్లాడి తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టారు.ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం నూతన పాపమ్మ గడ్డ కాలనీలోనే రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.కాలనీలో ఏర్పాటు చేసిన భవనంలో గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరీం చేతుల మీదుగా రేషన్ బియ్యం పంపిణీ జరిగింది. దీంతో కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు,గ్రామ పెద్దలు, గ్రామస్తులు,యువత,యువకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల ఇబ్బందులను వెంటనే గుర్తించి పరిష్కారం చూపినందుకు ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి కి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ నిర్ణయంతో పాపమ్మ గడ్డ కాలనీ ప్రజలకు ఇకపై రేషన్ సరుకుల కోసం దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది.

Sthanikam

బోరంచ గ్రామ పాపమ్మ గడ్డ కాలనీవాసులకు రేషన్ సౌకర్యం

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News