Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:29 PM

బూతులు కాదు అభివృద్దె నా అజెండా వేముల వీరేశం

05-02-2026 189 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిరుమర్తి లింగయ్య వ్యాఖ్యలకు ఎమ్మెల్యే వేముల వీరేశం కౌంటర్

నకిరేకల్ నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి వేడి చర్చకు దారితీసే వ్యాఖ్యలు వెలువడ్డాయి. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇటీవల చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రజావేదికపై ఘాటుగా స్పందించారు. చిట్యాల పట్టణ కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే వేముల వీరేశం, వ్యక్తిగత దూషణలు, ఆరోపణల రాజకీయాలకు తాను దూరమని స్పష్టం చేశారు. అభివృద్ధే తన లక్ష్యమని, అదే అంశంపై తాను మాట్లాడతానని వెల్లడించారు.

“నన్ను ఎంత తిట్టినా నాకు అభ్యంతరం లేదు. కానీ ఈ ఊరికి ఏం కావాలి? ఏం చేయాలి? అనే దానిపై చర్చ జరగాలి” అంటూ సూటిగా వ్యాఖ్యానించారు.

తాను బూతులు మాట్లాడే సంస్కారం లేని వ్యక్తినని పేర్కొంటూ,“వాడు–వీడు అనే భాష నాకు రాదు. నా తల్లిదండ్రులు నాకు విలువలు నేర్పారు. నన్ను కన్న ఊరు నాకు సంస్కారం నేర్పింది. ఆ విలువలతోనే నేను రాజకీయాలు చేస్తున్నాను” అని అన్నారు.

గ్రామ అభివృద్ధిపై ప్రశ్నలు సంధిస్తూ,“ఒక్క రోడ్డు అయినా వేయగలమా? పేదవాడికి ఇల్లు అయినా ఇప్పించగలమా? కనీస మౌలిక వసతులైనా కల్పించగలమా?” అని ప్రశ్నించారు.పేదల కోసం పనిచేయడంలో విమర్శలకైనా సిద్ధమేనని స్పష్టం చేస్తూ,

“ఒక పేదవాడికి ఇల్లు కట్టిస్తానంటే… వంద మాటలైనా నేను పడతా” అని వ్యాఖ్యానించారు.

మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వ్యాఖ్యలకు కౌంటర్‌గా వచ్చిన ఈ వ్యాఖ్యలు నకిరేకల్ నియోజకవర్గంలో రాజకీయ చర్చను మరింత వేడెక్కిస్తున్నాయి. విమర్శలకంటే అభివృద్ధే ముఖ్యం అన్న సందేశాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం బలంగా వినిపించారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Sthanikam

బూతులు కాదు అభివృద్దె నా అజెండా వేముల వీరేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News