Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 02:38 PM

బొడ్రాయి పునర్ ప్రతిష్టకు నా వంతు కృషి చేస్తా

24-02-2026 129 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పట్టణ ప్రజలతో సంప్రదించి నిర్ణయం – మున్సిపల్ ఛైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్ష్యాది

సూర్యాపేట పట్టణంలో నూతన బొడ్రాయి పునర్ ప్రతిష్ట కోసం తన వంతు కృషి చేస్తానని మున్సిపల్ ఛైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్ష్యాది తెలిపారు. మంగళవారం బొడ్రా బజార్‌లోని శ్రీ వేదాంత భజన మందిరంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం, బిఆర్ఎస్ నాయకుడు షీలా శంకర్ విజ్ఞప్తి మేరకు మందిరం పక్కనే ఉన్న బొడ్రాయిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణ ప్రజల భావోద్వేగాలు, భక్తి విశ్వాసాలను గౌరవించడం తన బాధ్యత అని అన్నారు. బొడ్రాయి పునర్ ప్రతిష్ట అంశంపై స్థానిక ప్రజలు, ఆధ్యాత్మిక ప్రముఖులు, నాయకులతో సంప్రదించి తగిన నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. సంప్రదాయాలను పరిరక్షించడంలో మున్సిపాలిటీ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. పట్టణ అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక కేంద్రాల సంరక్షణ కూడా సమానంగా అవసరమని పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని అందరి సమ్మతితో ముందుకు సాగుతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వల్దాసు లక్ష్మి, ఆర్యవైశ్య నాయకులు రాచర్ల వెంకటేశ్వరరావు, రాచకొండ శ్రీనివాస్, సోమ సుమన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బొడ్రాయి పునర్ ప్రతిష్టకు నా వంతు కృషి చేస్తా

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News