Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:10 PM

బండి సంజయ్ కుమారుడిపై చర్యలు తీసుకోవాలి

బండి సంజయ్ కుమారుడిపై చర్యలు తీసుకోవాలి

బండి సంజయ్ కుమారుడిపై చర్యలు తీసుకోవాలి
12-05-2026 185 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌లో బీఆర్ఎస్ నేతల నిరసన.. దిష్టిబొమ్మ దహనం

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడిపై నమోదైన కేసులో తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు వలిగొండ రోడ్డులో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బండి సంజయ్ దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు.అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, మైనర్ బాలిక కేసులో భగీరథపై పోక్సో చట్టం కింద కేసు నమోదైందని ఆరోపించారు. బాధిత కుటుంబం మూడు నెలల క్రితమే ఫిర్యాదు చేసినప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అధికార ప్రభావంతో కేసును ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.బండి సంజయ్ తన కుమారుడిని వెంటనే పోలీసులకు అప్పగించాలని, కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించాలని, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై కూడా విమర్శలు చేశారు.బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కన్వీనర్ బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు గిర్కటి నిరంజన్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు చిన్నం బాలరాజు, మాజీ మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్స్ కొయ్యడ శేఖర్, ఉదరి యాదయ్య, ఉడుగు మల్లేశం, తాడూరి పరమేష్, మునుకుంట్ల సత్యనారాయణ, ఢిల్లీ శంకర్ రెడ్డి, ఎండి అతర్ పాషా, ఎండి మున్నా, జమీర్, చుక్క యాదయ్య, చేవగోని మహేష్ గౌడ్, జాని యాదవ్, ఊదరి శ్యామ్, గుండెబోయిన వెంకటేశం యాదవ్, నాగరాజు, ఆరుట్ల లింగస్వామి, ఇమ్మడి ఈశ్వర్, ఊదరి రాజేష్,అత్తు, శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బండి సంజయ్ కుమారుడిపై చర్యలు తీసుకోవాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News