Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:08 PM

బండి భగీరథుని వెంటనే అరెస్టు చేయాలి

బండి భగీరథుని వెంటనే అరెస్టు చేయాలి

బండి భగీరథుని వెంటనే అరెస్టు చేయాలి
14-05-2026 94 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌లో సీపీఎం నిరసన.. బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన ఫోక్సో కేసులో వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ చౌటుప్పల్ మున్సిపల్, మండల కమిటీల ఆధ్వర్యంలో గురువారం చౌటుప్పల్ బస్టాండ్ ఎదురుగా నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బూర్గు కృష్ణారెడ్డి మాట్లాడుతూ, మైనర్ బాలికపై మానసిక, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కేసు నమోదైనా ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు.కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. “బేటీ బచావో” అని చెప్పే కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఈ ఘటనపై స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఫోక్సో కేసు నిందితుడిని వెంటనే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బండి సంజయ్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఎం మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్, మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, నాయకులు చీక సంజీవరెడ్డి, బత్తుల శ్రీశైలం గౌడ్, చీర్క అలివేలు, బోయ యాదయ్య, పొట్ట శ్రీనివాస్, ఆకుల ధర్మయ్య, కందగట్ల ఆనంద్, కొండే శ్రీశైలం, కొంతం శ్రీనివాస్ రెడ్డి, బత్తుల రామచంద్రం, బాలగోని బాలరాజు, ఫకీర్ పెంటారెడ్డి, జగ్గం అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బండి భగీరథుని వెంటనే అరెస్టు చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News