Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:14 PM

బివీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రోత్సాహం

13-03-2026 127 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రతిభ కనబరిస్తే ఆర్థిక సహాయం:

బూరుగు భరత్ రెడ్డి

చౌటుప్పల్ మండలం కుంట్ల గూడెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు బివీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్షల మెటీరియల్ పంపిణీ చేశారు. ఫౌండేషన్ చైర్మన్ బూరుగు భరత్ రెడ్డి విద్యార్థులకు పరీక్షలకు అవసరమైన మెటీరియల్‌ను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 14వ తేదీన ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదువుకుంటే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని పేర్కొన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని, సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు.పదవ తరగతిలో మొదటి, రెండవ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎలిజిబెత్, ఫౌండేషన్ ప్రతినిధులు కందగట్ల శివకుమార్, పాపగళ్ళ హరీష్, ఇత్తబోయిన శివకుమార్, కొండే మణికంఠ, చిన్నబోయిన చరణ్, కొండే శ్రీను, అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బివీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రోత్సాహం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News