Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:06 PM

బి. ఆర్ అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగుదాం

16-02-2026 206 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అంబేద్కర్ విగ్రహానికి కౌన్సిలర్ల ఘన నివాళి

ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కౌన్సిలర్స్ కు ఘనంగా సన్మానం

చౌటుప్పల్ మున్సిపాలిటీ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన రిజర్వేషన్ల ఫలితంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎస్సీ రిజర్వేషన్ ద్వారా ఎన్నికైన 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి-సాయిలు, 8వ వార్డు కౌన్సిలర్ బద్రి గాలయ్య, ఎస్టీ రిజర్వేషన్ ద్వారా 18వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికైన బుడ్డా సురేష్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ల వలన తాము కౌన్సిలర్లుగా ఎన్నికకావడం గర్వకారణమని తెలిపారు. అంబేద్కర్ లేనిదే మనకు జీవనం లేదని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయ సాధన కోసం అందరం కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు ఘనంగా సన్మానం నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ, రిజర్వేషన్ల ద్వారా ఎన్నికైన ప్రతి ఒక్కరూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను మదిలో నిలుపుకుని దేవుడిలా భావించి, ఆయన ఆశయాల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాదిగ, రాష్ట్ర నాయకులు బోయ దేవేందర్, మండల అధ్యక్షులు బొడ్డు శ్రవణ్ కుమార్, సీనియర్ నాయకులు బక్క శ్రీనాథ్, సుక్క సుదర్శన్, మాదాని గోపాల్, మండల ఉపాధ్యక్షులు చీమకండ్ల శ్రీనివాస్, మున్సిపాలిటీ అధ్యక్షులు ఎర్ర శంకర్, మాజీ మండల అధ్యక్షులు దొనకొండ కృష్ణ, ఉదరి నరసింహ, దొనకొండ కిరణ్, గణేష్, బద్రి గాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బి. ఆర్ అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగుదాం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News