Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:19 AM

భువనగిరిలో వైభవంగా వందేమాతరం సామూహిక గీతాలాపన

28-01-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

శ్రీ వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం రోజున స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 'వందేమాతరం సామూహిక గీతాలాపన'కార్యక్రమం అత్యంత అట్టహాసంగా ఉత్సాహభరిత వాతావరణంలో చాలా ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న సామాజిక వేత్తలు ఎర్ర నర్సింగ్,మంత్రిపెగడ శ్రీధర్ మాట్లాడుతూ భారత స్వతంత్ర సంగ్రామ సమయంలో దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చిన శక్తివంతమైన తారక మంత్రం ‘వందేమాతర గీతం'అని కొనియాడారు. ఆనాటి దేశభక్తులు వందేమాతరం మంత్రాన్ని ఆయుధంగా ధరించి పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారని ఆ స్ఫూర్తితో నేటి విద్యార్థులు,యువకులు దేశ భక్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. భావిభారత పౌరులైన విద్యార్థులే ఎదిగి పర్యావరణ పరిరక్షణ, జలవనరుల సంరక్షణ, విద్యుత్ పొదుపు వంటి వాటిని అమలు చేసేందుకు కృషి చేయాలని, మన స్వదేశీ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని కోరారు. వివేకానంద సేవా సమితి ప్రోగ్రామ్స్ కన్వీనర్ బండిరాజుల శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భువనగిరి పట్టణంలోని వివిధ కళాశాలల,పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో తరలివచ్చి ముక్తకంఠంతో వందేమాతరం గీతాన్ని ఆలపించారు. వివేకానంద సేవా సమితి అధ్యక్షులు బాదం ప్రకాశ్, పట్టణంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు పసునూరి నాగభూషణం,మార్త వెంకటేశం, గడ్డం చంద్రశేఖర్,తొగిడి భాస్కర్, బెల్ద గణేష్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమ నిర్వహణలో జాగిలాపురం నాగరాజు,సుదగాని ఆంజనేయులు, కాసం సత్యనారాయణ,మెరుగు మహేష్, పబ్బతి సురేందర్, బేతి కన్నయ్య ఎం.కె.శ్రీధర్,మెరుగు మధు,ఆడెపు పాండు,సుర్వి మణికంఠ,బెల్లంకొండ చంద్రకాంత్, పంచద్దుల భరత్,బొడ్డు సాయి కిరణ్,విరాట్,పి.సంతోష్ మరియు వివిధ పాఠశాల,కళాశాలల యాజమాన్యాలు క్రియాశీలకంగా వ్యవహరించారు.

Sthanikam

భువనగిరిలో వైభవంగా వందేమాతరం సామూహిక గీతాలాపన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News