Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 21, 2026 09:59 PM

భువనగిరిలో ఘనంగా రంజాన్ వేడుకలు

భువనగిరిలో ఘనంగా రంజాన్ వేడుకలు

భువనగిరిలో ఘనంగా రంజాన్ వేడుకలు
March 21, 2026 08:25 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ముస్లిం సోదరుల పవిత్రమైన పండుగ రంజాన్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.నెల రోజుల పాటు కఠిన ఉపవాస అంకుటిత దీక్షలు పాటించి అల్లాకు ప్రీతి పాత్రులయ్యారు. శనివారం రంజాన్ పండుగ సందర్భంగా భువనగిరి పట్టణంలో ఉదయం ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.రంజాన్ పండుగ సందర్భంగా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి,ప్రధాన ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ...నెలరోజుల నుండి పవిత్ర రంజాన్ మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేసి పవిత్ర గ్రంథం ఖురాన్ పఠించి సామాజిక సేవలు దానధర్మాలు చేయడం రంజాన్ పండుగ ప్రతియేటా భువనగిరి పట్టణంలో శాంతియుతంగా జరుపుకోవడం అనవాయితిగా వస్తుందని అన్నారు.ప్రపంచ శాంతి కలగాలని,ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమం అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తుందని అన్నారు. ఉదయం నుండే పట్టణంలోని ప్రధాన ఈద్గా మైదానాలు భక్తులతో కిక్కిరిసిపోగా,మత గురువులు (మౌలానాలు) ఈద్ ఖుత్బాను చదివి వినిపించారు.ప్రార్థనల అనంతరం ముస్లింలు ఒకరినొకరు 'ఈద్ ముబారక్'చెప్పుకుంటూ ఆలింగనం చేసుకున్నారు. పట్టణంలోని మసీదులు విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించబడ్డాయి. ఈ పండుగ వేడుకల్లో స్థానిక రాజకీయ పార్టీల నాయకులు,ప్రజాప్రతినిధులు పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.ప్రభుత్వం తరపున నిరుపేదలకు పంపిణీ చేసిన'రంజాన్ తోఫా'కిట్లు పండుగ ఆనందాన్ని మరింత పెంచాయి.మైనార్టీ వెల్ఫేర్ సొసైటీలు ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమాలు, వస్త్ర దానాలు నిర్వహించారు. చిన్నారులు కొత్త బట్టలు ధరించి,ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన ఆటపాటలతో సందడి చేశారు.ప్రతి ఇంట్లో ఘుమఘుమలాడే 'షీర్ కుర్మా'తో బంధుమిత్రులకు విందులు ఇచ్చి ఆతిథ్యం ఇచ్చారు.శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు ఈద్గా మరియు మసీదుల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పట్టణంలోని ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.ఈ పండుగ ద్వారా భువనగిరిలో మత సామరస్యం మరియు గంగా-జమునా తెహజీబ్ సంస్కృతి మరోసారి వెల్లివిరిసింది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్,వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు,జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేష్ చిస్తి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్,ఎలిమినేటి కృష్ణారెడ్డి,ఆర్డీవో కృష్ణారెడ్డి,ఎమ్మార్వో జగన్,మున్సిపల్ కమిషనర్ రాజలింగం,విద్యుత్ శాఖ అధికారులు,ముస్లిం మత పెద్దలు,లాయిక్ అహ్మద్,మాదార్,ఇలియాస్,బూరాన్,రఫీ,షానూర్,ఖాజాబాయ్,పసిఉద్ధిన్ వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News