Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:25 AM

భువనగిరి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన డీఎస్పీ

21-05-2026 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజలకు మర్యాదపూర్వక సేవలు అందించాలని సూచన

భువనగిరి,: భువనగిరి డివిజన్ డీఎస్పీ బి. రవీందర్ గురువారం భువనగిరి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణ విధానం, ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో రిసెప్షన్ అధికారి, సిబ్బంది స్నేహపూర్వకంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. దీంతో ప్రజల్లో పోలీస్ శాఖపై గౌరవ భావం పెరుగుతుందని తెలిపారు. ప్రజలకు త్వరితగతిన, పారదర్శకంగా సేవలు అందించాలని ఆదేశించారు.

స్టేషన్‌లోని రికార్డులు, ఫైల్స్‌ను ‘5ఎస్ విధానం’ ప్రకారం క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు. పోలీస్‌స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రికార్డుల నిర్వహణపై ప్రత్యేకంగా పరిశీలించి పలు సూచనలు చేశారు.

సందర్శనలో భువనగిరి రూరల్ ఎస్‌హెచ్‌వో ఎం. అనిల్‌కుమార్, ఎస్‌ఐపీ కె. శివశంకర్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

భువనగిరి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన డీఎస్పీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News