Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:16 AM

భువనగిరి మున్సిపాలిటీలో కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం

17-02-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

35వార్డు కౌన్సిలర్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ భువనగిరి మున్సిపల్ చైర్మన్ గా,

29వ వార్డు కౌన్సిలర్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లతో అదనపు కలెక్టర్ భాస్కరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా 35వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ భువనగిరి మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించగా, 29వ వార్డు కౌన్సిలర్ పోతంశెట్టి మంజుల వెంకటేష్ వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.పలువురు ప్రజాప్రతినిధులు,అధికారులు,పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు హాజరై నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్,వైస్ చైర్మన్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ తంగాళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్ మాట్లాడుతూ... పట్టణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు కూడా పట్టణ అభివృద్ధి కార్యక్రమాల్లో సమన్వయంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా కొత్త పాలకవర్గం సమిష్టిగా కృషి చేయాలని అదనపు కలెక్టర్ భాస్కరరావు ఆకాంక్షించారు.

Sthanikam

భువనగిరి మున్సిపాలిటీలో కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News