Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:19 AM

భువనగిరి మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యం

04-02-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ప్రతి గడపను కదిలించి కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

బీజేపీ అభ్యర్థులకు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పిలుపు

భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం గారి అధ్యక్షతన భువనగిరి పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అభ్యర్థులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భువనగిరి మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి బీజేపీ అభ్యర్థి తమ తమ వార్డుల్లో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు విస్తృతంగా వివరించాలన్నారు. ప్రతి గడపను కదిలిస్తూ బలమైన ప్రచారం చేపట్టాలని సూచించారు. ప్రతి వార్డులో కనీసం 50 మంది కార్యకర్తలతో సమన్వయంగా పనిచేస్తూ, భువనగిరి మున్సిపాలిటీపై భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసేలా కృషి చేయాలన్నారు. పార్టీ కార్యకర్తే చైర్మన్‌గా గెలిచే విధంగా ప్రతి ఒక్కరు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బూర నర్సయ్య గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడూరు నారాయణ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఉట్కూరు అశోక్ గౌడ్, జిల్లా మాజీ అధ్యక్షులు పాశం భాస్కర్, నర్సింగ్ రావు, సుర్వి శ్రీనివాస్, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి, చందుపట్ల వెంకటేష్, యాదిరెడ్డి, చందా మహేందర్ గుప్తా, పట్టణ ప్రధాన కార్యదర్శి రాళ్లబండి కృష్ణచారి, ఇండ్ల సత్యలక్ష్మి, తిరుమలేష్, ఆకుతోట రాము, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భువనగిరి మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News