Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:23 AM

భువనగిరి మున్సిపల్ నూతన చైర్మన్‌గా ఎన్నికైన తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్‌కు శబరి నగర్ అయ్యప్ప దేవాలయంలో ఘన సన్మానం

24-02-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి టౌన్: భువనగిరి పట్టణంలోని శబరి నగర్ లో ఉన్న శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. భువనగిరి 35వ వార్డు కౌన్సిలర్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ భువనగిరి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చిరు సన్మానం మరియు వేద ఆశీర్వచనం కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక చైర్మన్ అయిత రాములు,అధ్యక్షులు నూనె వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు గాదె శ్రీనివాస్ తదితరులు శాలువా కప్పి సత్కరించి అభినందనలు తెలిపారు. ఆమె భువనగిరి పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షిస్తూ వేద పండితులు ఆశీర్వచనం అందించారు.

కార్యక్రమంలో సభ్యులు మంచాల ఋషికేష్,చీకటిమల్ల రాములు,పోకుల సోమన్న,సుగ్గుల చంద్రశేఖర్, మాజీ చైర్మన్ మంచాల ప్రభాకర్, ఆలయ ప్రధాన అర్చకులు నరేందర్ శర్మ మరియు ఇతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీవాణి రవికుమార్ మాట్లాడుతూ,తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ భువనగిరి పట్టణ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య విజయవంతంగా ముగిసింది.

Sthanikam

భువనగిరి మున్సిపల్ నూతన చైర్మన్‌గా ఎన్నికైన తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్‌కు శబరి నగర్ అయ్యప్ప దేవాలయంలో ఘన సన్మానం

Article Image

భువనగిరి టౌన్: భువనగిరి పట్టణంలోని శబరి నగర్ లో ఉన్న శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. భువనగిరి 35వ వార్డు కౌన్సిలర్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ భువనగిరి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చిరు సన్మానం మరియు వేద ఆశీర్వచనం కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక చైర్మన్ అయిత రాములు,అధ్యక్షులు నూనె వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు గాదె శ్రీనివాస్ తదితరులు శాలువా కప్పి సత్కరించి అభినందనలు తెలిపారు. ఆమె భువనగిరి పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షిస్తూ వేద పండితులు ఆశీర్వచనం అందించారు.

కార్యక్రమంలో సభ్యులు మంచాల ఋషికేష్,చీకటిమల్ల రాములు,పోకుల సోమన్న,సుగ్గుల చంద్రశేఖర్, మాజీ చైర్మన్ మంచాల ప్రభాకర్, ఆలయ ప్రధాన అర్చకులు నరేందర్ శర్మ మరియు ఇతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీవాణి రవికుమార్ మాట్లాడుతూ,తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ భువనగిరి పట్టణ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య విజయవంతంగా ముగిసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News