Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:19 AM

భువనగిరి మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్–సీపీఎం పొత్తు

29-01-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

సీపీఎంకు 6వ వార్డు కేటాయింపు - 35 వార్డుల్లో బిఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా

బ్యూరో:శ్రీనివాస్

భువనగిరి టౌన్‌: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్, సీపీఎం పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో భువనగిరి మున్సిపాలిటీలో సీపీఎం పార్టీకి 6వ వార్డును కేటాయించినట్లు వెల్లడించారు.

ఈ సమావేశంలో భువనగిరి మున్సిపల్ బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ బండ నరేందర్ రెడ్డి, భువనగిరి మాజీ శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ ఇంచార్జ్ పైళ్ల శేఖర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ మాట్లాడుతూ, మొత్తం 35 వార్డులలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు సీపీఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. 6వ వార్డు సీపీఎం పార్టీ అభ్యర్థిగా సీనియర్ నాయకులు కొలుపుల వివేక్‌ను బిఆర్ఎస్ పార్టీ తాజా మాజీ కౌన్సిలర్ తుమ్మల పాండు బలపరిచారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్, మాజీ రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు కొలుపుల అమరేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్యతో పాటు పార్టీ సీనియర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భువనగిరి మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్–సీపీఎం పొత్తు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News