Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:20 AM

భువనగిరి మున్సిపల్ ఎన్నికల్లో బీసీల విజయం చరిత్రాత్మకం

18-02-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మున్సిపల్ ఎన్నికల్లో బీసీల సత్తా - సామాజిక న్యాయానికి బలమైన సందేశం

బీసీ చైతన్యానికి గెలుపు గర్జనగా మున్సిపల్ కౌన్సిలర్లు

జనరల్ మహిళా చైర్మన్, వైస్ చైర్పర్సన్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యం

రాజకీయ సాధికారత వైపు బీసీ మహిళలు ముందడుగు

ఎమ్మెల్యే కుంభం అనిల్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు గెలుపు పతాకం ఎగురవేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.బీసీ సంఘాల ఉద్యమ స్ఫూర్తితో అధిక సంఖ్యలో కౌన్సిలర్లుగా విజయం సాధించడం బీసీల సామూహిక చైతన్యానికి నిదర్శనమని బీసీ సంక్షేమ సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భువనగిరి జిల్లా కేంద్రంలోని జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కొత్త నరసింహస్వామి మాట్లాడుతూ,రాష్ట్రంలో అత్యధిక శాతం బీసీలు కౌన్సిలర్లుగా గెలవడం సాధారణ విషయం కాదన్నారు.బీసీల శక్తిని అధిష్టానం గుర్తించి రాష్ట్రంలో అధిక సంఖ్యలో చైర్మన్ పదవులను బీసీలకు కేటాయించడం చారిత్రాత్మక నిర్ణయమని వ్యాఖ్యానించారు. భువనగిరి నియోజకవర్గంలోని భువనగిరి,పోచంపల్లి మున్సిపాలిటీల చైర్మన్ పదవులను బీసీలకు కేటాయించడం శుభపరిణామమని,ఇది సామాజిక న్యాయానికి బలమైన సందేశమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి బీసీ సంఘాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.బీసీల రాజకీయ సాధికారతకు ఇది నాంది అని,భవిష్యత్తులో మరింత ప్రాధాన్యం కల్పించాలని నాయకులు కోరారు.రాబోయే ఎంపీటీసీ,జెడ్పిటిసి స్థానాలలో బీసీలు ఆత్మవిశ్వాసంతో పోటీ చేసి,ఎంపీపీ,జెడ్పీ చైర్మన్ పదవులను కూడా కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు గొట్టిపాముల బాబు రావు,నియోజకవర్గ అధ్యక్షుడు సాబన్ కార్ వెంకటేష్,భువనగిరి మండల అధ్యక్షుడు చిన్న మల్లేష్,శివకుమార్,పుమార్ విక్రమ్,కిషన్,చెన్నోజుల నరేంద్ర చారి,వడ్లకొండ ఉపేంద్ర చారి,బలరాం,బ్రహ్మచారి ప్రతాప్ చారి,శ్రీధరాచారి,చక్రపాణి తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

భువనగిరి మున్సిపల్ ఎన్నికల్లో బీసీల విజయం చరిత్రాత్మకం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News