Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:46 PM

భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి

భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి

భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి
March 16, 2026 08:19 PM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

-తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో కళాశాల ఏర్పాటు కోసం తీర్మానం చేయాలి

- డిగ్రీ కళాశాల నిధులు కేటాయించాలి

- ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు డిమాండ్ చేశారు.సోమవారం రోజున భువనగిరి జిల్లా కేంద్రం సుందరయ్య భవనంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం జిల్లా అధ్యక్షులు వేముల నాగరాజు అధ్యక్షతన జరిగింది.ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం,బీఎస్పీ రాష్ట్ర నాయకులు బట్టు రామచంద్రయ్య,బీసీ సంఘం రాష్ట్ర నాయకులు రాందేవ్ బాబా హాజరై భువనగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం ప్రజా సంఘాలందరినీ కలుపుకొని బలమైన పోరాటాలు నిర్వహించాలని,పాలక ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలని పోరాటాల ద్వారానే డిగ్రీ కళాశాల సాధ్యమవుతుందని రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు,ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ మాట్లాడుతూ... భువనగిరి జిల్లా ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్న కనీసం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని,భువనగిరికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందని ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి జన్మించిన గడ్డ,తెలంగాణ సాయుధ పోరాటం ఆంధ్ర మహాసభకు కేంద్రమైన గడ్డ భువనగిరి,జిల్లా ఏర్పడినప్పుడు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని టిఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది ఏర్పాటు చేయకుండా కాలయాపన చేసింది నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోని స్వయానా రేవంత్ రెడ్డి భువనగిరి ప్రచారంకి వచ్చినప్పుడు భువనగిరి జిల్లా కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చే రెండు సంవత్సరాలు గడుస్తున్నా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయకుండా కాలయాపన చేస్తా ఉన్నారు,ప్రభుత్వ విద్యారంగాన్ని బలవపేతం చేస్తామని పాలక ప్రభుత్వాలు ప్రైవేటు విద్యా సంవత్సరం ప్రోత్సహించడం సిగ్గుచేటని,ప్రైవేటు విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థులు స్కాలర్షిప్ ఫీజు రీయంబర్స్మెంట్ రాక చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది,పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ గత ఆరు సంవత్సరాల నుంచి 8500 కోట్లు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ప్రభుత్వం విడుదల చేయకుండా విద్యార్థులకు చదువు దూరం చేస్తా ఉన్నది,మంత్రులు ఎమ్మెల్యేలు ఉండడానికి సొంత భవనాలు నిర్మించడానికి వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం పేద మధ్య తరగతి విద్యార్థులు చదువుకోవడానికి డిగ్రీ కళాశాల ఏర్పాటుకు నిధులు కేటాయించడం లేదు.గత టిఆర్ఎస్ ప్రభుత్వం విధానాలే నూతన వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి మార్పు లేదు ఇప్పటికైనా జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు స్పందించి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం,అసెంబ్లీ సమావేశా విద్యా రంగానికి 30శాతం నిధులు కేటాయించాలని కొఠారి కమిషన్ ప్రకారం విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని చెబుతున్న ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించకుండా కాలయాపన చేస్తామన్నది,అసెంబ్లీ సమావేశంలో భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని తీర్మానం చేయాలి దాంతోపాటు డిగ్రీ కళాశాల కోసం బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తానము,లేనియెడల జిల్లాలో ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని అన్నారు,ఇంకా ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ ,పిఎన్ఎం జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు,కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి అన్నంపట్ల కృష్ణ,ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ధరావత్ జగన్ నాయక్,నాయకులు భాస్కర్ నాయక్,అమిత్ పాషా,సుందరయ్య,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News