Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:20 AM

భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి దేవస్థాన ఈవోకు రైతుల వినతి

16-05-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పునరుద్ధరణ కోసం భూములు ఇచ్చిన రైతులు, భూ నిర్వాసితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ శనివారం దేవస్థానం ఈవోకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండ వెనుక భాగంలో ఉన్న తమ భూములను దేవస్థాన అభివృద్ధి కోసం అప్పగిస్తే దుకాణాలు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కోట్ల రూపాయల విలువైన భూములను ప్రభుత్వ ఆదేశాలను గౌరవిస్తూ ఇచ్చినా, పరిహారం రూపంలో డబ్బులు మాత్రమే అందించారని, హామీలు మాత్రం అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

భూములు కోల్పోవడంతో వ్యవసాయం లేకుండా పోయిందని, ఉపాధి అవకాశాలు లేక కుటుంబాలతో కలిసి ఇతర ప్రాంతాలకు వెళ్లి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నామని తెలిపారు. తమ భూములపై దేవస్థానం వ్రత మండపాలు, వాహన పూజా కేంద్రాలు, అన్నదాన భవనం, హెలిప్యాడ్, పార్కింగ్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేసి భక్తులకు ఉపయోగపడుతున్నాయని, కానీ భూములు ఇచ్చిన తామే ఇబ్బందులు పడుతున్నామని అన్నారు.

రోడ్డు విస్తరణలో ఇండ్లు, దుకాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం నివాస స్థలాలు, దుకాణాలు ఇచ్చినట్లే, తమకూ కొండపై లేదా కొండ వెనుక భాగంలో దుకాణాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.

కార్యక్రమంలో బి. నాగరాజు, నర్సింహ, రాములు, ఆర్‌. మత్స్యగిరి పాల్గొన్నారు.

Sthanikam

భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి దేవస్థాన ఈవోకు రైతుల వినతి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News